Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడి చెత్త పొడి చెత్త వేరుగా సేకరిస్తున్నారా
- డంపింగ్ యార్డులో వర్మి కంపోస్ట్ తయారు చేస్తున్నారా
- పల్లె ప్రగతిలో సమీక్ష నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ-శాయంపేట
మిషన్ భగీరథ పథకంలో ప్రతి ఇంటికి నీరు అందుతుందా అని ప్రజలను మంత్రికి ఎర్రబెల్లి దయా కర్రావు ప్రశ్నించగా కొందరు రావటం లేదని చెప్పడంతో అధికారులను స్టేజిపైకి పిలిచి ఒక్క ఇంటికి మిషన్ భగీరథ నీరు రాకున్నా నౌకర్లు ఉండవని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హెచ్చరించారు. వారం రోజుల్లో ప్రతి ఇంటికి భగీరథ నీరు నచ్చేలా చూ డాలని అధికారులను ఆదేశించారు. పత్తిపాక ప్రభుత్వ ఉన్న త పాఠశాల ఆవరణలో ఆదివారం పల్లె ప్రగతి పై సమీక్ష సమావేశం మంత్రి నిర్వహించారు. ప్రతి ఇంటికి తడి, పొడి చెత్త వేయడానికి డబ్బాలు పంపిణీ చేశారా, ప్రతిరోజు ట్రాక్టర్ తో చెత్త సేకరణ చేస్తున్నారా అని ప్రజలను ప్రశ్నిం చారు. చెత్త సేకరణకు ట్రాక్టర్ సరిపోని యెడల ట్రై సైకిళ్లు ద్వారా చెత్త సేకరించాలని పంచాయతీ కార్యదర్శి రాజేం ద్రప్రసాద్ను ఆదేశించారు. డంపింగ్ యార్డ్‌లో ఎర్రల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారా అని ప్రశ్నిం చారు. తయారుచేసిన ఎరువును హరితహారం మొక్కలకు వేస్తున్నామని, మిగిలింది అమ్ముతున్నామని కార్య దర్శి తెలిపారు. రోడ్డు పక్కన కాగితాలు, చెత్త, సీసాలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఎందుకు తొలగించలేదని మంత్రి ఆగ్రహిం చారు. ప్లాస్టిక్ వ్యర్థాల నుండి దారం తయారుచేసే పరిశ్రమను ఎనిమిది వేల కోట్లతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పత్తి సాగు ఎక్కువగా ఉంటుందని, వరంగల్ జిల్లా పత్తి పండించే స్థానంలో నెంబర్‌వన్‌లో ఉంటుందని, చేనేత పరిశ్రమలతో పత్తికి మంచి డిమాండ్ ఉంటుం దన్నారు. స్మశాన వాటికలో మొక్కలు పెంచాలని, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామంలో క్రీడాప్రాంగణం ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆగ్రహిం చారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా చేసీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. పలు అభివద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు గ్రామంలో ఎస్డిఎఫ్, ఎంపీ నిధులు రూ .14 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటీ భవనాన్ని మంత్రి గండ్ర దంపతులతో కలిసి ప్రారం భించారు. రూ.5 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనుల ను ప్రారంభించారు. అలాగే ప్రభుత్వ ఉన్నత ప్రా థమిక పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.93 లక్షలతో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.కార్య క్రమంలో సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి, ఎంపీపీ మెతు కు తి రుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ రామ్శెట్టి లతా లక్ష్మారెడ్డి, ఎం పీ టీసీ ఐలయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సమస్యలు తెలుసుకుంటూ... ఆప్యాయంగా పలకరిస్తూ
మండలంలోని పత్తిపాకలో ఆదివారం పల్లె ప్రగతి కార్యక్రమంలో గండ్ర దంపతులతో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటిస్తూ రోడ్డు ప్రక్కన ఉన్న మహిళలను, వద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. అక్కా బాగున్నావా, అవ్వ బాగున్నావా ప్రభుత్వం నుండి ఆసరా పింఛన్ వస్తుం దా, నెల నెలకి పింఛన్ అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. మిషన్ భగీరథ కుళా యి ల ద్వారా నీరు వస్తుందా అని అడగడమే కాకుండా కు ళా యిలు విప్పగా నీరు వస్తుండడంతో మంత్రి సంతప్తి వ్యక్తం చేశారు.
అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి
మండలంలోని పత్తిపాకలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీసీ కమ్యూనిటీ భవనం ప్రారంభోత్సవానికి కాలినడకన వెళ్తుండగా రోడ్డు పక్కన చెత్త, ప్లాస్టిక్ వ్యర్ధాలు కుప్పలుగా పడి ఉండడంతో మంత్రి అసంతప్తి వ్యక్తం చేశారు. జెడ్పీ సీఈవో రాజారావు, డిపివో జగదీశ్వర్‌ను పిలిచి చెత్త ఇలా ఉంటే, ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై పర్యవేక్షించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, పల్లె ప్రగతి లో పనులు పూర్తి చేయించాలని సూచించారు.