Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండలంలో మొత్తం గ్రామాలు 15
- క్రీడా మైదానాలు గుర్తించినవి 2
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామీణ ప్రాంతాల్లో ఆటలు, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికో క్రిడా మైదా నం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పోటీల నిర్వహణతోపాటు శిక్షణకు అనువుగా ఉండటానికి ఎకరం స్థలంలో క్రిడా మైదానం అభివద్ధి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఉపాధిహామీ కింస ఎకరం స్థలంలో రూ. 4లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసే మైదానంలో ఖోఖో,కబడ్డీ,వాలీబాల్ కోర్టులు లాంగ్ జంప్ పిట్ ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉండగా ఇప్పటికి కేవలం కొయ్యుర్, మల్లారం గ్రామాల్లో అధికారులు క్రిడా మైదానాలు గుర్తించి ప్రారంభించారు. మిగతా 13 గ్రామాల్లో మైదానాల కోసం స్థలాలను సేక రించడంలో నిమగమయ్యారు. గ్రామాల్లో ఎకరం స్థలం దొరకని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేకపోవ డంతో గ్రామాల్లో మైదానాల ఏర్పాటు సాధ్యం కాకపోవచ్చని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అసైన్డ్, శిఖం భూములపై ఆందోళన
మండలంలో కొయ్యుర్, మల్లారం గ్రామాల్లో ప్రభుత్వ భూములు గుర్తించారు. మిగతా గ్రామాల్లో ప్రభుత్వ భూములు లేకపో వడం కొంత సమస్యగా మారింది. దీంతో గత్యంతరం లేక అధికారులు చెరువు శిఖం భూములు, రాళ్లు రప్పలతో ఎందుకు పనికి రాని భూములను క్రీడా మైదానాలుగా గుర్తిం చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో పెదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను గుర్తించి ప్రభు త్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లుగా సమా చారం. కాగా మల్లారంలో గుర్తించిన క్రిడా స్థలం ఎందుకు పనికి రాని మురుగు నీరు ప్రవహించే ఒర్రె కావడంతో అధికారులు మట్టి పోసి మైదానంగా మార్చారు.
అనువైన స్థలాలు దొరకని వైనం...
మండలంలోని ఆయా గ్రామాల అధికారులు ఇప్పటికే స్థల సేకరణ కోసం గ్రామాల బాట పట్టారు. క్రీడా మైదానాలకు అనువైన స్థలాలే కాకుండా అసలు ఎకరం స్థలం దొరకని పరిస్థితి. గతంలో డబుల్ బెడ్రూం ఇల్లు ,వైకుంఠ దామాలు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులకు స్థలాలు దొరక్క ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పటికి చాలాచోట్ల స్థలాలు లేకపోవడంతో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించడం లేదు. ఇప్పడు ప్రతి గ్రామంలో ఎకరం భూమి సేకరిం చేందుకు అధికారులు తలలు పట్టుకుంటు న్నారు. పైగా క్రీిడా మైదానాలు గ్రామాలకు అనుకోని చేయాలనే నిబంధనలు ఉండటంతో మరింత సమస్య ఎదురవుతోంది. గతంలో రైతు వేదికలను స్థలం లేకపోవడంతో ఊరికి దూరంగా నిర్మించారు. ఎకరం స్థలం దొరకని అనుబంధ గ్రామాల్లో 5 నుంచి 10 గుంటలు తక్కువ ఉన్న మైదానాలు ఏర్పాటు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
స్థలాలను గుర్తిస్తున్నాం
క్రీడా మైదానాల ఏర్పాటు కోసం స్థలాలను గుర్తిస్తున్నాం. కానీ, అనువైన స్థలాలు లభించడం లేదు. రాళ్లు రప్పలు ఉన్న స్థలాలు ఉండటంతో మైదానాలు ఏర్పాటు చేయడం కష్టంగా ఉంది. స్థలాలు లభించిన చోట ఎకరం కాకుండా 5 నుంచి 10 గుంటలే లభిస్తుంది. మైదానాల స్థలాలు గుర్తించేందుకు రోజు సర్పంచ్ లతో చర్చిస్తున్నాం.మండలంలో ఇప్పటికే కొయ్యుర్, మల్లారం గ్రామాల్లో క్రిడా మైదానాలు గుర్తించాం.
- ఎంపీడీఓ నరసింహమూర్తి