Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
మండలం క్యాంపు కార్యాలయం లో జరిగిన వన మాల కనిపర్తి గ్రామ మృతుల కుటుంబాలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున 70 మంది కుటుంబాలకు సుమారు రూ.7 లక్షలను వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అద్వర్యం లో వనమాల కనిపర్తి గ్రానైట్ అసోసియేషన్ వారు ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నియో జకవర్గ అభివృద్ధి ప్రజల కష్ట సుఖాల్లో తాను ఎప్పుడు ముందుంటానని, వనమాల కనిపర్తి గ్రామాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటా మన్నారు. కార్యక్రమంలో జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీ రాములు,జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఉస్మాన్ అలీ,వైస్ ఎంపీపీ తంపుల మోహన్ ,మండల రైతు బంధు సమితి అధ్యక్షులు జయపాల్,నందనం సొసైటీ వైస్ చైర్మన్ చందర్ రావు,మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శి పోలేపల్లి శంకర్ రెడ్డి, బుర్ర రాజశేఖర్, నియోజకవర్గ అధికార ప్రతినిధి మిద్దెపాక రవీందర్,మండల మహిళా అధ్యక్షురాలు దేవికా రెడ్డి, ప్రచార కార్యదర్శి కోమలత,ఎస్టీ సెల్ అధ్యక్షులు పల్లం కొండ సురేష్, మైనారిటీ సెల్ అబ్బాస్ అలీ, యూత్ అధ్యక్షులు నరేష్, గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉపేంద్ర చారి, ఎంపీటీసీ మెరుగు రాజేందర్, సర్పంచ్ స్వర్ణ రవి, పాల్గొన్నారు.