Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,919 మంది గైర్హాజర్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్షకు హన్మకొండ జిల్లాలో 1,919 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఆది వారం ఉదయం, మధ్యా హ్నం జరిగిన ఈ పరీక్షకు నిమిషం ఆలస్య మైతే అభ్యర్థులను పరీక్ష రాయడానికి అనుమతించలేదు. ఉదయం 13 వేల 752 మంది అభ్యర్థులకుగాను 12 వేల 767 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సెషన్లో 985 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నాం పరీక్షకు 12 వేల 377 మందికి 11 వేల 443 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇందులో 934 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. హన్మకొండ జిల్లాలో టెట్ పరీక్షకు సంబంధించి 58 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ జి. సంధ్యారాణి పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు.
టెట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
సుబేదారి : సుబేదారి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలలో కొనసాగుతున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆది వారం తనిఖీ చేశారు. కలెక్టర్‌తో ఆర్డిఓ వాసుచంద్ర తదితరులు ఉన్నారు.
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన డీఈవో
వరంగల్ జిల్లాలో టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. బుధవారం వరంగల్‌లోని పద్మావతి డిగ్రీ కాలేజీ, ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లోని టెట్ పరీక్షల కేంద్రా లను డీఈవో వాసంతి తనిఖీ చేశా రు. ఉదయం జరిగిన మొదటి పేపర్లో 8222 అభ్యర్థులకు 7505 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 717 మంది గైర్హాజర య్యారు. మధ్యా హ్నం జరిగిన రెండో పేపరులో 7325 మంది అభ్యర్థులకు 6711 మంది అభ్యర్థులు హాజ రయ్యారు. 614 మంది గైర్హాజరయ్యారు. 91.62 శాతం హాజరైనట్లు డీఈవో తెలిపారు.
ప్రశాంతంగా టీఎస్ టెట్-2022 పరీక్షలు
నవతెలంగాణ-నర్సంపేట
టీఎస్ టెట్ -2022 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని 11 సెంట ర్లో టెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫస్ట్ పేపర్‌కు 2,462 మంది బీఈడీ, టీటీసీ అభ్య ర్థులకు 2,189 మంది హాజరయ్యారు. మధ్యా హ్నం 2.30 గంటలకు రెండో పేపర్‌కు 1,565 మంది అభ్యర్థులకు 1354 మంది అభ్య ర్థులు హా జయ్యారు. ఈ పరీక్ష కేంద్రాలకు డీజీడబ్ల్యూవో ఎం.అశోక్ రూట్ ఆఫీసర్‌గా, అడిషనల్ రూట్ ఆఫీ సర్గా ఇంవ్రావతి సుజాత వ్యవహరించారు. డీవో, సీఎస్‌లు పరీక్షలను పర్యవేక్షించారు. సీఐ పులి రమేష్ నేతృత్వంలో పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేపట్టారు.