Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్‌ఘన్‌పూర్
ప్రైవేట్ పాఠశాలలోని పైపై మెరుగులు నమ్మి తల్లి దండ్రులు మోసపోవద్దని, తల్లిదండ్రులు, వారిపిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని హెచ్ఎం కౌడ రాజేందర్ అన్నారు. మండలం లోని తాటికొండ జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం బడిబాట కార్యక్రమం నిర్వహించినట్టు హెచ్ఎం తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠ శాల అభివద్ధికి ప్రజలు అందిస్తున్న సహాయ సహకారాలతో పాఠశాల ఉన్నత స్థాయిలో నిలవడమే కాక గత కొన్ని సంవత్సరాలుగా 100శాతం ఫలితాలు సాధిస్తున్నట్టు తెలిపారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పిల్లలకు భారంలేని నాణ్య మైన విద్య అందిస్తున్నామన్నారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలో వేల కొలది ఫీజులు చెల్లించి వ్యయ ప్రయాసలకు పోకుండా, సమాజంలో నాణ్య మైన పౌరులుగాతీర్చిదిద్దే ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో బోధన, ఒత్తిడిలేని నైతిక విలువలతో కూడిన విద్య అందిస్తున్నట్టు తెలిపారు. దశ్య, శ్రవణ పరికరాల ద్వారా విద్యాబోధన ఉంటుందన్నారు. 6నుండి8 వరకు ఆంగ్లంలో,9నుండి10 వరకు తెలుగు ఆంగ్లంలో పాఠ్యపుస్తకాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపి ణీ చేస్తారన్నారు. పౌష్టిక ఆహార మైన మధ్యాహ్న భోజనం, శుద్ధమైన మంచినీరు అందించడం జరుగుతుందన్నారు. ఆయనవెంట ఉపాధ్యాయులు ఉన్నారు.