Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
మండలంలోని నర్సక్కపల్లి, నడికూడ, నార్లపూర్, ధర్మారం గ్రామాల్లో రోడ్డు విస్తరణలో భాగంగా ఇండ్లు కోల్పోయిన బాధితులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయించామని చెప్పారు. నడికూడ మండలంలో నర్సక్కపల్లి, నార్లాపూర్, నడికూడ, ధర్మారం గ్రామాల్లోనే125 మందికి మంజూరు పత్రాలు అందజేమన్నారు. అందరి సహకారంతో నియో జకవర్గాన్ని మరింత అభివద్ధి చేసేందుకు కషి చేస్తా నన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివద్ధి పనులను చూసి ప్రతిపక్ష నాయకులకు గ్రామాలలో ముఖం చూ పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. ఇచ్చిన మా టకు కట్టుబడి రోడ్డు వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినందుకు లబ్ధిదారులు ఎమ్మె ల్యేకు కృతజ్ఞతలు తెలిపి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, జెడ్పిటిసి కొడపాక సుమలత కరుణాకర్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధానకార్యదర్శి గణపతి రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.