Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1000 మందికిపైగా డాక్టరేట్స్ ప్రదానం
- 12 మందికి గోల్డ్ మెడల్స్
నవతెలంగాణ-హసన్‌పర్తి
మండలంలోని ఎర్రగట్టుగుట్ట కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ప్లే ఫీల్డ్స్‌లో ఆదివారం ఘనంగా 37వ, 38వ యాన్యువల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వారు 3వ, 4వ అటానమస్ బ్యాచ్ (2016-20 నుంచి 2017-21) నిర్వహించిన 37వ, 38వ గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ముఖ్య అతి థులుగా డీఆర్డీఓ చైర్మన్, సెక్రటరి డిఫెన్స్ ఆర్ అండ్ డీ హైదరాబాద్ డాక్టర్ సతీష్‌రెడ్డి, గౌవర అతిథులుగా కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ తాటికొండ రమేష్, ఎంపీ, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల గవ ర్నింగ్ బాడీ చైర్మన్ కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌రెడ్డిలు హా జరై జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి భారతదేశ ప్రభుత్వ డీఆర్డీఓ ఛైర్మన్, హైదరాబాద్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఆర్ అండ్ డి, సెక్రటరీ, డాక్టర్ జి.సతీష్ రెడ్డి మాట్లా డుతూ డీఆర్డీఓ తన కార్యక్రమాల ద్వారా డిఫెన్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్, డేర్ టు డ్రీమ్ ప్రోగ్రామ్ ద్వారా స్టార్టప్‌లను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తోందని చెప్పారు. వ్యవస్థల నిర్మాణానికి దారితీసే వినూత్న ఆలో చనలకు ఈ పథకాల కింద నిధులు సమకూరుతు న్నాయన్నారు. ఈ విద్యా సంవత్స రానికి సంబంధించి వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 12 మందికి బంగారు పతకాలు అందజేశామన్నారు. ఈ విద్యా సంవత్సరానికి 2018-22 బ్యాచ్ కు గాను 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లలో 1500 కంటే ఎక్కువ మంది విద్యా ర్థులను ప్రపంచవ్యాప్తంగా బహుళ జాతి కంపెనీలలో ఎంపిక అయ్యేవిధంగా తీర్చిదిద్దామని అన్నారు. కిట్స్ వరంగల్ బహుళజాతి కంపెనీలతో మరియు ప్రభుత్వ. పరిశోధనా కేంద్రాలతో మొత్తం 32 ఎంఓయూలను కలిగి ఉందన్నారు. జాతీయ స్థాయి పోటీలలో క్రీడలు, ఆటలలో అథ్లెటిక్స్‌లో ఓవరాల్ కేయూ ఛాంపియన్షిప్ పొందినట్లు తెలిపారు. ఈ కార్యక్ర మంలో డీన్ అకాడమిక్ ప్రోఫెసర్ వి.రాజగోపాల్, పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ పి.కామాక్షి, డాక్టర్ బి.కిరణ్ కుమార్, కిట్స్ యాజమాన్య కమిటీ సభ్యులు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వి.సతీష్‌కుమార్, ఏ.హరీష్, వి.కిషన్‌రావు, కె.దేవీప్రసాద్, పి.రామేశ్వరరెడ్డి, ఏ.సత్యనారాయణరాజు, కె.రాజ ప్రతాప్ రెడ్డి, పీఆర్ఓ డాక్టర్ డి.ప్రభాకరాచారి, తదితరులు పాల్గొన్నారు.