Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
పేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మనబడి, మన ఊరు-మన బడి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని 27 వార్డు జవహర్ కాలనీ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠ శాలలో 14 వ వార్డు జంగేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠ శాలలో ఏర్పాటు చేసిన మన బస్తీ మన బడి కార్య క్రమంలో సుమారు రూ.కోటికి పైగా వివిధ మౌలిక వసతుల కల్పన కోసం శంకుస్థాపనలు చేశారు. అట్లాగే 11వ వార్డు వేశాలపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం జంగేడు హైస్కూల్లో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్య తనిస్తూ ప్రభుత్వం ప్రత్యేక కషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఈ సంవత్సరం విద్యా రంగ సంస్థల అభివద్ధి కోసం మూడు వేల కోట్ల నిధులను కేటాయించి విద్యా రంగానికి పెద్దపీట వేసిందన్నారు. అందులో భాగంగానే భూపాలపల్లి లోని జిల్లా పరి షత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.52.90 లక్షలతో మౌళిక సదు పా యాల కల్పన కొరకు పనుల నిర్మాణం కొరకు శంకు స్థాపన, జంగేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రూ.51 లక్షల 17 వేలతో మౌళిక సదుపాయాల కల్పన నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎస్ వెంకట రాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరి బాబు, జెడ్పి చైర్ పర్సన్ శోభ రఘు పతి రావు, ఎంపీపీ మండల లావణ్య విద్యాసాగర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, స్థానిక కౌన్సి లర్లు దారా పూలమ్మ, గండ్ర హరీష్ రెడ్డి, ముంజం పల్లి మురళి,జక్కం రవికుమార్, ముంజలా రవీందర్, బద్ది సమ్మయ్య, ఎడ్ల మౌనిక శ్రీనివాస్, పానుగంటి హారిక శ్రీనివాస్, టిజే ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మాడ హరీష్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు పైడి పల్లి రమేష్, బండారి రవి పాల్గొన్నారు.