Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్పీ సురేందర్ రెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు చట్ట ప్రకారం న్యాయం చేయాలని జయ శంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేం దర్‌రెడ్డి పోలీసు అధికారులను ఆదేశిం చారు. సోమవారం జిల్లా పోలీసు కార్యా యంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్ర మంలో ఆయన నేరుగా బాధితులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని సంభందిత అధికారులను న్యాయం చేయాలని ఆదే శిం చా రు. సోమవారం జరిగిన ప్రజాదివాస్ కార్య క్రమంలో భూ, అస్తి సంబంధిత పంచా యతీ లు 7, నగదు లావాదేవీలకు సంబంధించినవి -2, కుటుంబ కలహాలకు సంబంధించినవి 5, వివిధ మోసాలు సంబంధించిన ఫిర్యాదులు 1, చిన్న చిన్న వివాదాల సమస్యలకు సంబం ధించినవి 2, మొత్తం 17 ఫిర్యాదులు అందా యి. వీటిపై విచారణ జరిపి, సాధ్యమైనంత త్వరగా బాధితుల సమస్యలకు పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.