Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి
నవతెలంగాణ-శాయంపేట
పల్లె ప్రగతి కార్యక్రమంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. మండలంలోని కొత్తగట్టు సింగారం లో సోమవారం ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్ర మంలో ఆమె పాల్గొని గ్రామంలోని నర్సరీ, డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనాన్ని సం దర్శించి పరిశీలించారు. గ్రామంలోని వీధులలో సైడు కాలువలు పరిశీలించారు. తాగునీటి ప్రధాన పైపు లైన్ లీకేజీ కావడంతో తవ్వకాలు చేపట్టి వదిలి వేసి ఉండడంతో వెంటనే పనులు పూర్తిచేయాలని సర్పంచ్‌ని, పంచాయతీ కార్యదర్శిని ఆమె ఆదేశించారు. గ్రామంలో జరిగిన అభివద్ధి పనులు, వెచ్చించిన నిధులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకపో వడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సహకా రంతో అదనపు తరగతి గదులకు నిధులు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ పెంబర్తి సంతోష మల్లేశం, , ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి, ఎంపీవో రంజిత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి శైలజ, గ్రామస్తులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన సత్యనారాయణ (చంటి) ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. సోమవారం జెడ్పి చైర్పర్సన్ గండ్ర జ్యోతి బాధిత కుటుంబాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె వెంట టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్ రెడ్డి, పరకాల ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.