Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి
నవతెలంగాణ-కమలాపూర్
మండలాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని కమలాపూర్, ఉప్పల్, గుండెడు, మర్రిపల్లి, మర్రిపల్లి గూడెం, వంగ పల్లి, అంబాల గూడూరు గ్రామాలలో ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మండలానికి అత్యధిక నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభివద్ధిని మర్చిపోయి తమ అభివృద్ధే లక్ష్యంగా పని చేశాడని మండిపడ్డారు. మా జీ మంత్రి ఈటల రాజేందర్ ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కమలా పూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం చేపట్టక పోవడం ఆయన చేతకాని తనానికి నిదర్శనమన్నారు. మహిళల కోసం మహిళ భవ నాన్ని ఏర్పాటు చేయక పో వడం బాధాకరమన్నారు. రాబోయే కొన్ని నెలలలో మహిళా భవనాన్ని నిర్మించి తీరుతామని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కి సవాల్ విసిరారు. పల్లె ప్రగతి కార్య క్రమం హాజరు కావలసిన ఎమ్మెల్యే ఈటెల హాజరుకాకపోవడం తమ చిత్తశుద్ధి ఏంటిదో అర్థం అవుతుందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ సుధీర్ బాబు, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంపీపీ రాణి శ్రీకాంత్, జెడ్పీటీసీ కళ్యాణి లక్ష్మణరావు, సర్పంచ్ కట్కూరి విజయ తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ సంపత్ రావు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, తదితరులు పాల్గొన్నారు.