Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-హన్మకొండ
ప్రభుత్వరంగ విద్యాసంస్థలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫల మైందని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున అన్నారు. సోమవారం హనుమకొండ డీఈవో కార్యాలయంలో ఏడీని కలిసి మెమోరాండం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విద్య, వైద్యం ఉచితంగా అందిస్తామని చెప్పిన కేసీఆర్ కార్పొరేట్ విద్యా సం స్థలకు రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకు తున్నా రన్నారు. బడిబాట కార్యక్రమం పేరుతో కోట్ల రూపా యలు మాయం, ఏం చేస్తున్నాడు కానీ ప్రభుత్వ విద్య సంస్థలలో కనీస మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు. ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ మాస్ సావిత్రి మాట్లా డుతూ కార్పొరేట్ ప్రైవేటు విద్యా సంస్థలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీస ుకు వచ్చి పగడ్బందీగా అమలు అయ్యే విధంగా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసు కోవాలన్నారు. కార్యక్రమంలో హనుమ కొండ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం రాజు, పిట్టల సాయి కుమార్, మాగాణి సాయితేజ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.