Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని మండ లంలోని గుండంరాజుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ, ఉత్తమ బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో విద్యుత్, నీటి, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. అనంతరం దొంతు సత్తయ్య-సుశీల, దొంతు వెంకన్న జ్ఞాపకార్ధం విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ చేశారు. కార్య క్రమంలో సర్పంచ్ సలీమా గంగన్న, తహసీల్దార్ రామకృష్ణారావు, నాయకులు మురళీధర్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మెన్ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు ఎల్లారెడ్డి, దొంతు నవీన్, యూత్ మండల అధ్యక్షుడు మురళీ, తదితరులు పాల్గొన్నారు.