Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ఈనెల 26న తలపెట్టిన కేవీపీఎస్ మూడో మహాసభలను జయప్రదం చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్ర మహేష్ కోరారు. మండల కేంద్రంలో అశోక్ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశానికి మహేష్ పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల రోజురోజుకు దళితులపై దాడులు, అరాచకాలు పెరుగుతున్నాయని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ మతోన్మాదంతో పాలన సాగిస్తోందని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగ లక్ష్యాల సాధన, దళితుల హక్కుల కోసం పోరాడాలని కోరారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విస్సంపల్లి సైదులు, నాయకులు మండలి యాకన్న, గణపురం ఎల్లయ్య, బాణాల యాకయ్య, బూటామంచి యాకయ్య, ఈసంపల్లి ఐలయ్య, బండ ఉపేందర్, ఏకాంతం, సోములు తదితరులు పాల్గొన్నారు.