Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎంఓ బద్దం సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-ములుగు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన గురించి ప్రచారం చేయాలని అకడమిక్ మానిటరింగ్ అధికారి (ఏఎంఓ) బద్దం సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం సందర్భంగా మండలంలోని మహ్మద్‌గౌస్‌పల్లి, శ్రీరాములపల్లి, బంవడారుపల్లి, ములుగు గ్రామాల్లోని ప్రభుత్వ ఎంపీపీఎస్, ఉర్దూ మీడియం పాఠశాలలను ఆయన సోమవారం సందర్శించి విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును పరిశీలించి సూచనలు అందించారు. ఈనెలాఖరు వరకు ప్రభుత్వం నిర్ధేశించిన కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. సదుపాయాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలల పట్ల సానుకూల దక్పథం కలిగేలా చూడాలని కోరారు. ఆంగ్ల మాధ్యమం గురించి ప్రచారం చేసి విద్యార్థుల నమోదు పెంచాలని చెప్పారు. తల్లిదండ్రుల, ఎస్ఎంసీ సమావేశం నిర్వహించాలని తెలిపారు. 1వ తరగతిలో చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించాలని, కరపత్రాలు ముద్రించి పాఠశాల ప్రగతిని సమాజానికి తెలియజేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కాలా, యాకూబ్‌రెడ్డి, సమ్మయ్య, నాగిరెడ్డి, శ్రీనివాస్, కందాల రామయ్య, నర్సింహమూర్తి, రవి, రాజిరెడ్డి, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.