Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
రైతులు, ప్రజలు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలని ఖానాపురం సర్పంచ్ శెట్టిపల్లి ఉమారాణి సోమయ్య కోరారు. మండలంలోని ఆ గ్రామంలోని చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. వేసవిలో ఈజీఎస్ నుంచి నిధులు అధికంగా మంజూరు అవుతాయని చెప్పారు. తద్వారా గ్రామం అభివద్ధి చెందుతుందని తెలిపారు. అలాగే రైతులు తక్కువ ఖర్చుతో సారవంతమైన నల్లరేగడి వ్యవసాయ భూముల్లో తరలించుకుంటే భూసారం పెరుగుతుందని చెప్పారు.