Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
- జిల్లా కలెక్టర్ శశాంక
నవతెలంగాణ-నర్సింహులపేట
పనిలో మార్పు రాకపోతే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శశాంక స్పష్టం చేశారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన కోరారు. మండలంలోని రామన్నగూడెం, షకీరాతండా గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. తొలుత రామన్నగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలను, పల్లె ప్రకతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రకతి వనం ఆశించిన తీరులో ఉందని సర్పంచ్ నర్సయ్యను, కార్యదర్శి సాయిరెడ్డిని అభినందించారు. పల్లె ప్రకతి వనాల్లో సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు శాతం పెంచాలని చెప్పారు. పౌష్టికాహార లోపం ఉన్న వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, వయస్సుకు తగ్గ బరువు లేని పక్షంలో జాగ్రత్తలు తీసుకోవాలని, బాలమతం అందించాలని, తదితర సూచనలు అందించారు. అనంతరం పకీరాతండాలో కలెక్టర్ పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు అందించారు. సెగ్రెగేషన్ షెడ్ నిర్వహణకు గాను మల్టీ పర్పస్ వర్కర్ లకు నెలవారీ గా విధులు కేటాయించి సెగ్రిగేషన్ షెడ్ నిర్వహణ మెరుగు పరచాలని అన్నారు. సెగ్రిగేషన్ షెడ్ కు ట్రాక్టర్ వచ్చే విధంగా రోడ్డును సరి చేయాలని, లాగ్ బుక్ నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లోని 286 ఇళ్ల నుంచి ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని చెత్త సేకరణ చేయాలని, వంద ఇళ్లకు ఒక ట్రై సైకిల్ తో ప్రతి రోజూ చెత్త సేకరణ, పారిశుధ్య పనులు జరిగే విధంగా చూడాలన్నారు.హరిత నర్సరీ నీ పరిశీలిస్తూ, పెంచుతున్న మొక్కల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ విజయ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీపీఓ సాయిబాబా, ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి, తహసీల్దార్ విజరుకుమార్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ సొంలాల్, సర్పంచ్లు నర్సయ్య, శంకర్, ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షుడు రవినాయక్, తదితరులు పాల్గొన్నారు.