Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాధారణ ప్రసవాలను వైద్యులు ప్రోత్సహించాలి
- డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య
నవతెలంగాణ-ములుగు
కాన్పుల కోసం పూజారులు ముహూర్తాలు పెట్టొద్దని డీఎంహెచ్ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య కోరారు. వైద్యులు సాధారణ ప్రసవాలను ప్రోత్సహిం చాలని ఆయన ఆదేశించారు. జిల్లా ఏరియా ఆస్పత్రిలోని సమావేశ మందిరం లో వైద్యాధికారులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీష్‌తో కలిసి డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లా డారు. ఆస్పత్రులకు కాన్పుల కోసం వచ్చే గర్భిణులకు సీ సెక్షన్ కాకుండా సాధారణ డెలివరీ చేయాలని సూచించారు. ఆస్పత్రిలో 24 గంటలూ ప్రసూతి వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అన్ని ఆస్పత్రుల్లో కుని శస్త్ర చికిత్సలు చేయాలని, ఏటూరునాగారం సామాజిక కేంద్రంలో, వాజేడు పీహెచ్సీలో జూలై మొదటి, మూడో వారాల్లో సదరం క్యాంప్‌లు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో వైద్యులు రఘు, సురేష్‌కుమార్, మధురిమ, ప్రవీణ్, రాజేష్, ఆయేషా, శ్రమలత, హారిక, నర్సింగ్ సూపరింటెండెంట్ సరోజిని, హెడ్ నర్స్ రాధ, తదితరులు పాల్గొన్నారు.