Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సమాజ హితానికి పాటుపడాలని స్టేషన్ ఘన్పూర్ ఏసీపీ రఘుచందర్ కోరారు. డివిజన్ కేంద్రంలోని గాంధీ కూడలి వద్ద నిర్మిస్తున్న స్పీడ్ బ్రేకర్ పనులను సీఐ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏసీపీ సోమవారం పరిశీలించి ప్రజలకు అవగాహన కల్పించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యతగా నియమాలను అనుసరించాలని సూచించారు. వాహనదారులు, పాదచారులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని అన్నారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర అవసరమైన వాహన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. త్రిబుల్ రైడింగ్ చేయొద్దని, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వాహనదార్లు సురక్షితంగా ఇండ్లకు చేరాలని ఆకాంక్షించారు. సినా ప్రమాదాలకు కారణమైనా లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్సై శ్రీనివాస్, శ్రావణ్‌కుమార్, ఏఎస్సై రవీందర్, హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్, ఖాజా, కుమార్, తదితరులు పాల్గొన్నారు.