Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షుడిగా చిల్లా నిరంజన్ ఏకగ్రీవ ఎన్నిక
- అక్రెడిటేషన్ కమిటీ
- సభ్యుడిగా మార్నేని కొనసాగింపు
నవతెలంగాణ-మహబూబాబాద్
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)తో నాగేశ్వర్రావుకు సంబంధం లేదని జిల్లా ప్రధాన కార్యదర్శి తాటికొండ సదా శివరావు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో సోమ వారం నిర్వహించిన ఫెడరేషన్ అత్యవసర సమా వేశానికి జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సదా శివరావు హాజరై మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు గా చిల్లా నిరంజన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ప్రకటించారు. సీనియర్ జర్నలిస్ట్, ఫెడరేషన్ వ్యవస్థాపక సభ్యుడు మార్నేని నర్సింహారావుపై నాగేశ్వర్రావు చేసిన ఆరోపణలు అర్ధరహితమని చెప్పారు. నాగేశ్వర్రావు చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని తెలిపారు. మెజార్టీ ఫెడరేషన్ సభ్యులు నాగేశ్వర్రావు ప్రకటన రద్దు చేశార న్నారు. మార్నేని నర్సింహారావు సంఘంలో కొన సాగుతున్నాడని, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడుగా కొనసాగించాలని తీర్మానించినట్లు తెలిపారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా యూనియన్ను అప్రతిష్ట పాల్జేసేలా వ్యవహరిం చిన నాగేశ్వర్రావుపై చర్యలు తీసుకోవాలని తీర్మానించినట్లు చెప్పారు. నాగేశ్వర్రావు వ్యవ హార శైలిపై వివరణ కోరగా అందుబాటులో లేడని, రాజీనామా ప్రకటన చేశాడని వివ రించారు. ఇక నుంచి ఫెడరేషన్తో నాగేశ్వర్ రావుకు సంబంధం లేదని తీర్మానించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడుగా చిల్ల నిరంజన్ను మెజార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. సమావేశం లో ఫెడరేషన్ జాయింట్ సెక్రెటరీ ఇస్లావత్ నరేష్, కోశాధికారి యనమల కిరణ్కుమార్, కార్యవర్గ సభ్యులు శ్రీపాల్, గణేష్, చంద్రమౌళి, వెంకటరమణ, ఓంకార్తోపాటు సభ్యులు పాల్గొన్నారు.