Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
జిల్లాలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిర్మూలించాలని మున్సిపల్ చైర్మెన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని తహసీల్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు సోమవారం నిర్వహించిన బైక్‌ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడారు. ప్లాటిక్ వ్యర్ధాలు పెరిగిపోతూ మానవాళికి, జంతువులకు పెను ముప్పు పరిణమిస్తోందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ బదులుగా జూట్, పేపర్ బ్యాగులను వాడాలని కోరారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ ఫరీద్, కమిషనర్ ప్రసన్న రాణి, డిప్యూటీ ఈఈ ఉపేందర్, కౌన్సిలర్ బోనగిరి గోపిరత్నం, గంగాధర్, చిదిరాల శరత్, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీహరి, రాజేష్, రెవెన్యూ అధికారి కిషోర్, ఈఈ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.