Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
నవతెలంగాణ-కాశిబుగ్గ
పరిశుభ్రత, పచ్చదనంం, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమం ముందుకు సాగు తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఆరూరి రమేష్ అన్నారు. 3వ డివిజన్ పరిధిలోని పైడిపల్లిలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిపై స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యా యులతో చర్చించారు. పాఠశాలకు మరో మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం స్కూల్ గ్రౌండ్ లెవెల్ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశిం చారు. పాఠశాల ఆవరణలో వంట గది నిర్మాణానికి భూమి పూజ చేశారు. గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసు కున్నారు. అనంతరం గ్రామానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ.1,22,500 విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలితకుమార్యాదవ్, కార్పొరేటర్ జన్ను షిభా రాణీ అనిల్, సొసైటీ చైర్మన్ ఇట్యాల హరికష్ణ, డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, మాజీ కార్పొరేటర్ వీర బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.