Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
కలెక్టర్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేయడం జరుగుతుందని వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ శ్రీవాత్సవ అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కాజీపేట వెంకటరమణ అధ్యక్షతన ట్రాన్స్‌జెండర్ హెల్ప్ డెస్క్ కార్యక్ర మాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల గుర్తింపు కార్డుల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్ల పట్ల ఎలాంటి వివక్ష చూపించినా చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డీఎం హెచ్‌వో వెంకరమణ మాట్లాడుతూ అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మందులను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమ అధికారులు శారద, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ నర సింహారెడ్డి, సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్ సూపర్వైజర్లు పాలకుర్తి సదానందం, జమాల్, రామలింగయ్య, పాల్గొన్నారు.