Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
జులై 3న రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో హుజురాబాద్లో నిర్వహించ తల పెట్టిన రైతు ఉద్యమ మహాసభకు జిల్లాలోని వేలాది మంది రైతులు తరరావాలని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గుడూరి స్వామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని దామెర, కేశవాపూర్, చింత లపల్లీ, గుంటూరు పల్లి, తిమ్మాపూర్, గ్రామాల్లో రైతులతో నిర్వహించిన రైతు ఉద్యమ మహా సభ విజయవంతానికి సన్నాహక సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా రైతు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు జాగతం చేసేందుకు, వారి సమస్యలను ప్రభుత్వ దష్టికి తీసుకెల్లేందుకు, కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ,వేలాది మంది రైతుల తో నిర్వహించే రైతు ఉద్యమ మహా సభ కు ఉమ్మడి జిల్లా నుంచి రైతులు బారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. మండలం లోని దామెర, చింతల పెళ్లి, కేశవాపూర్, తిమ్మా పూర్, గుంటూరు పల్లె మొదలగు గ్రామాలలో కరపత్ర ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చల్లా రవీందర్రెడ్డి దామెర సర్పంచ్, వేముల రజనీ వెంకన్న ఎంపీటీసీ, కడారి బిక్షపతి ఉపసర్పంచ్, కడారి రాజేందర్ వార్డు నెంబర్, కొమ్మిడి మైపాల్ రెడ్డి వార్డ్ నెంబర్, మధ్య రాములు తదితరులు పాల్గొన్నారు.