Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్
నవతెలంగాణ-ములుగు
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమైనకాని పాఠశాలలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్టవేసి ఉన్నాయని,వాటిని వెంటనే పరిష్కరించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ మంగళవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విద్యార్థి యువకులకు కల్పించాల్సిన విద్య, వైద్యం, ఉపాధి కల్పన లో పూర్తి నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. జూన్ మాసం ప్రారంభంలోనే పాఠశాలలో కి రావల్సిన పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తదితర కనిస మౌళిక వసతుల కల్పన లో ఉపాద్యాయుల ను సిబ్బంది ని నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆర్టిసి బస్సు రవాణా చార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయని వీటి ప్రభావం విద్యార్థుల పై కూడా పడుతుందని అన్నారు. ప్రజలందరికీ కల్పించాల్సిన విద్య వైద్యం ఉపాధి కల్పన పై దష్టి పెట్టాలని డిమాండ్ చేశారు లేని యెడల ఆందోళన పోరాటాలు చేస్తామని తెలిపారు.