Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కేసముద్రం మండలం లో ని కోమటిపల్లి గ్రామంలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమానికి అద్భుతమైన స్పందన వస్తోందని, ఉపాధ్యాయులకు వెన్నుదన్నుగా సర్పంచులు, ప్రజాప్రతినిధులు నిలుస్తున్నారని సర్పంచ్ నీలం యాకయ్య అన్నారు. మంగళవారం ప్రజాప్రతి నిధులు, ఉపాధ్యాయుల బృందం సమీప తండాలు , గ్రామాలల్లో తిరిగి ప్రభుత్వ బడుల్లో చేర్పిం చాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పాఠశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నామని పిల్లలు చెప్పడంతో వాహనాన్ని సమకూర్చుతామని భరోసా ఇచ్చి ధాతల సహకారంతో వాహనాన్ని ఏర్పాటుచేసారు. రెండు నెలలు వాహన ఖర్చును భరించడానికి ముందుకు వచ్చిన గ్రామ స్థులు జల్లె శ్రీనువాస్ను అభినందించారు. ఉపాద్యాయ బృందం, వార్డు మెంబర్సు, కో ఆప్షన్ మెంబర్ కొమురయ్య, చిర్రగోని యాకమూర్తి,గడ్డం యాకమూర్తి, జల్లె శ్రీను,మల్లం యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.