Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి
- ములుగు ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లిలోని గౌరవెల్లి ప్రాజెక్టు ట్రయల్ రన్ పేరుతో అర్దరాత్రి పోలీసులు పేదలపై దౌర్జన్యం గా ప్రవర్తించడం అమానుషమని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ చిన్నా పెద్దా, మహిళలనే తేడా లేకుండా దౌర్జన్యం చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టడం, తలలు పగల కొట్టడం దారుణమన్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా నిర్వా సితులను ఆదుకోకుండా ఏళ్ల తరబడి సమస్యను నాన్చుతూ కాలయాపన చేయడం అన్యాయమని అన్నారు. ఉన్న ట్లుండి అర్దరాత్రి అకస్మాత్తుగా దాడులు చేయడం ఆటవికమని ఆయన మండిపడ్డారు. మహిళల పట్ల పోలీసులు అసభ్యంగా ప్రవర్తించడం దుర్మార ్గమన్నారు. అసలు అర్ధరాత్రి వెళ్లి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటో సీఎం సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. నిర్వాసితులకు పూర్తిగా ఆదుకున్న తర్వాతే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని, అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుం దని తెలిపారు. బాధితుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందని సీతక్క అన్నారు.