Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ యస్ క్రిష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
ప్రజల అవసరాల మేరకు పల్లెలు అభివృద్ధి చేయాలని కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. మంగళవారం 5వ విడత పల్లెప్రగతి లో భాగంగా మండలంలోని మల్లంపల్లిలో పల్లెప్రకృతి వనం, తెలంగాణా క్రీడ ప్రాంగణం, మనఊరు మననర్సరీ, బహత్ పల్లె ప్రకృతి వనం, గ్రామపంచాయతీ భవనాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలోని పరిసరాలు పరి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన సూచించారు. వర్షా లకు చెట్లు పడిపోకుండా వాటిని సరిచేయాలని, పల్లె ప్రకృతి వనంలో మొక్కల మధ్య దూరం ఉండ కుండా దగ్గర దగ్గరగా నాటాలని తెలిపారు. నర్సరీలలోని మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేందుకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. బహత్ పల్లె ప్రకృతి వనంకు ప్రక్కన ఉన్న ప్రభుత్వ భూమిని అద నంగా కలుపుకొని చెట్లను పెంచాలని అధికారులు ను ఆదేశించారు. ఆరేపల్లి నుండి గట్టమ్మ దేవా లయం వరకు ఫోర్ లైన్ రోడ్డు మంజూరు అయినం దున, రోడ్ల మీద ఎటువంటి వ్యాపారం జరుగకుండా మార్కెట్ లోనే అమ్మకాలు జరిగే విధంగా చూడాలని అధికారులను ఆదేశిం చారు. నూతనంగా నిర్మిం చిన ప్రారంభానికి సిద్ధంగా ఉన్న గ్రామ పంచాయతీ భవనంను తనిఖీ చేసి గ్రామపంచాయతీలో గ్రామ స్తులను వారి సమ స్యలను అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి కార్య క్రమంతో గ్రామాల రూపురేఖలు మారాలని, బెస్ట్ గ్రామ పంచాయతీలుగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేలా అధికారులు కషి చేయాలని సూచిం చారు. కార్యక్రమంలో ఆర్డీవో రమాదేవి ములుగు ఎంపీడీవో ఇక్బాల్, తహసిల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీఓ, ఎంపీటీసీ ప్రభా కర్, సర్పంచ్ చంద్ర కుమార్, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి , సెక్రటరీ రాజు తదితరులు పాల్గొన్నారు.