Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బకాయి ఉన్న ఉపాధిహామీ కూలి పైసలు ఇవ్వాలి
- సీపీఐ (ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణా రెడ్డి
నవతెలంగాణ-వెంకటాపురం
ఖరీఫ్ రైతులకు ఉచితంగా విత్తనాలను సరఫరా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు, సూడి కృష్ణారెడ్డి, భద్రా చలం అసెంబ్లీ నియోజకవర్గం ఇం చార్జ్ మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మం గళవారం మండల కేంద్రం లో వంకా రాములు అధ్యక్షత సీపీఐ(ఎం) పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మండలంలో అర్హులైన చాలా మంది రెండు పడకల ఇల్లు మంజూరు చేయక పోడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పెండింగ్లో ఉన్న ఉపాధి హామీ పనులకు సంబందించిన పైసలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ రైతు లకు సలహాలు, సూచనలు అందించడానికి వ్యవసాయ అదికారిని నియమించాలన్నారు. ఈ సమావేశం లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దబ్బకట్ల లక్ష్మయ్య, సాంబశివ, వెంకటాపురం, వాజేడు మండల కార్యదర్శులు కుమ్మరి శ్రీను, కొప్పుల రఘుపతి జిల్లా నాయకులు వాసు, ఆగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.