Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విచారణ జరిపి న్యాయం చేయాలి : మహిళా సంఘాల సభ్యులు
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
అమ్మపురం గ్రామంలోని మహిళా సమైక్య సంఘాలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు సీఏలను తొలగించి తిరిగి రిక్రూట్మెంట్ చేయడమేంటని, వెంటనే విచారణ జరిపి వేరే వారిని రిక్రూట్మెంట్ చేయాలని మహిళా సంఘాలైన సమత, అలివేల సమైక్య సంఘాల సభ్యులు కోరారు. మంగళవారం అమ్మపురం మహిళా సమైక్య సంఘం సభ్యులు సుభద్ర, ధనమ్మ, వెంకటమ్మ, భాగ్య, సుజాత, డొనుక లక్ష్మి, గూడెల్లి అలివేల, సుమీల, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ పీడీలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాడ్లాడుతూ... సమత మహిళా సమైక్య సంఘంలోని డబ్బులను సభ్యులకు తెలియకుండా రూ. లక్ష 3 వేలు, అలివేల మహిళా సమైక్య సంఘంలో రూ.23 వేల700 సీఏ మమత స్వాహా చేసిందన్నారు. దీంత ఇరువురిని విధుల నుంచి తొలగించినట్లు తొలగించి మళ్లీ విధుల్లోకి తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. మొదటగా అత్తగారి ఇంటి పేరుతో సీఏలుగా రిక్రూట్మెంట్ అయ్యారని, అవినీతి ఆరోపణల అనంతరం తల్లి ఇంటి పేరుతో ఇద్దరిని రిక్రూట్మెంట్ చేయడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని విచారణ తమకు న్యాయం చేయాలని కోరారు.