Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్‌సింగ్
నవతెలంగాణ-గంగారం
గర్బిణులకు, రోగులకు పౌష్టికాహారం అందించాలని రిటైర్డ్ మున్సిపల్ కమిషనర్ భూక్య దేవ్‌సింగ్ అన్నారు. మంగళవారం గంగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 130మంది మహిళలకు వైద్యాధికారి మహ్మద్ ముక్రమ్ ఆధ్వర్యంలో పౌష్టికా హారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. మండలంలో ఎక్కువగా పేద గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయని, పౌష్టికాహారం తీసుకోక పోవడం పుట్టే బిడ్డలు శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. గర్భిణులు ప్రతి నెల తప్పకుండా వైద్యుల సలహాలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆస్పత్రిలో రోగులకు జ్యూట్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజరు, ఆయుష్ డాక్టర్ సురయ్య,ఆయుష్ పార్మాసిస్ట్ మోహన్,సామాజిక వేత్త దొంతి విజేందర్ రెడ్డి,సేవాలాల్ సేన రాష్ట్ర నాయకులు పోరిక రాహుల్ నాయక్,బాదావత్ రాజ్ కుమార్,సాఫ్ నర్సు రేవతి, ఎన్డీసీ లక్ష్మీ, జయలక్ష్మి, ఫార్మాసిస్ట్ వనజ, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.