Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
కౌలు రైతులను పట్టించుకోరా అని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కేసముద్రం తాసిల్ధార్ కార్యాల యం ఎదుట కౌలు రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. కౌలు రైతులను గుర్తించక వారి జీవితాలతో చెలగాట మాడుతోందని అన్నారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 18 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ అంచనా వేసిందని అన్నారు. చట్టం ప్రకారం కౌలు రైతులకు ఏటా రుణ అర్హత కార్డులు ఇవ్వాలన్నారు. దీని ఆధారంగా బ్యాంకు రుణాలు, రైతు బీమా, ప్రకతి వైపరీత్యాల పరిహారం పంటల బీమా ప్రభుత్వ పథకాలు అమలు చేయాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో 45 శాతం కౌలుదారులు ఉన్నట్లు నేషనల్ క్రైమ్ రిపోర్టు బ్యూరో ప్రకటించిందని గుర్తు చేశారు. ఏటా మే 15 లోపు కౌలు రేట్లు జాయింటు లయబిలిటీ గ్రూపులు. జేఎల్జి ఏర్పాటు చేసి రూ.5 లక్షల వరకు రుణ సౌకర్యం ఇవ్వాలన్నారు. మండలస్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో నోడల్ ఆఫీసర్ నియమించి కౌలుదారులు సమస్యను పరిష్కరించాలన్నారు. 58 సంవత్సరాలు దాటిన కౌలు రైతులకు నెలకు రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. .కౌలు రైతుల డిమాండ్లు నెరవేర్చకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మార్తి నేని పాపారావు మొడెం వెంకటేశ్వర్లు, కవటి నరసయ్య, గొడిశాల వెంకన్న, చాగంటి కిషన్ , ఎండి యాకుబ్, జి సంజీవరెడ్డి, నీరుటి జలంధర్, లకవత్ బాలు, టి వెంకన్న, వీరన్న, భిక్షపతి, యూకూబ్ పాషా, సీఐటీయూ మండల కార్యదర్శి జల్లే జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.