Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రీజినల్ గెజిటెడ్ లైబ్రేరియన్ అలివేలు
- నవతెలంగాణ పబ్లిషింగ్ పుస్తక ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-వరంగల్
పుస్తక పఠనం ద్వార సంపూర్ణమైన శాస్త్రీయ విజ్ఞానం పెంపొందుతుందని ప్రాంతీయ గ్రంథాలయం, గెజిటెడ్ గ్రంథాలయ అధికారి, జిల్లా గ్రంథాలయ సెక్రెటరీ అలివేలు అన్నారు. నగర పరిధిలో పాత కారాగార కేంద్రం ఎదురుగా ప్రాంతీయ గ్రంథాలయంలో మంగళవారం నవ తెలం గాణ పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్స వానికి ఆమె ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనం తరం ఆమె మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుందని అన్నారు. అనంతరం నవ తెలం గాణ బుక్ హౌస్ మేనేజర్ బండారి బాబు మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం సివిల్స్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన పుస్తకాలతో పాటు నవలలు, కథలు, తెలంగాణ సాహిత్యం, భారతదేశ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, పర్సనాలిటీ డెవలప్మెంట్, మహనీయుల జీవిత చరిత్ర, వంటల పుస్తకం, కళలు, దళిత సాహిత్యం, అంబేద్కర్ రచనలు, జనరల్ సైన్స్ వంటి అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయన్నారు. నవతెలంగాణ పబ్లిషింగ్ ఆధ్వ ర్యంలో ప్రాంతీయ గ్రంథాలయం పాత జైలుకు ఎదురుగా ప్రాంతీయ లైబ్రరీ ఆవరణలో ఈ నెల 20 వరకు అందు బాటులో ఉంటాయన్నారు. పోటీపరీక్షల్లో సంబంధించిన పుస్తకాలపై 20 శాతం తగ్గింపు ఉంటుందన్నారు.
జ్ఞాన సముపార్జనకు పుస్తకాలు చదవాలి
డాక్టర్ క్రాంతికుమార్, పోటీ పరీక్షల కోసం అభ్యర్థి
పుస్తకాలు చదవటం వల్ల ఉద్యోగా లు పొందడమే కాకుండా శాస్త్రీయ పరి జ్ఞానం వస్తుంతది. పఠనం ద్వారా నైపు ణ్యం సజనాత్మకత వెలువడుతుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎది గేందుకు ఎంతో ఉపయోగపడుతుంది.
పుస్తక పఠనంతో విజ్ఞానం
(గంగల గౌతమి పోటీ పరీక్షల అభ్యర్థిని)
గతంలో పోటీ పరీక్షల కోసం హై దరాబాద్ వంటి ప్రదేశాలకు వెళ్లి పుస్త కాలు కొనుగోలు చేసి చదువు కునేది. అన్ని రకాల పుస్తకాలు నవతెలంగాణ పబ్లిషింగ్ హౌజ్లో దొరకడం నేడు సమయంతో పాటు డబ్బు వథా కాకుండా ఉండటం చాలా సంతోషం.