Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి
- కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క
నవతెలంగాణ-ములుగు
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కల్పిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క కోరారు. జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కోసం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భోజనం, వసతి గహాలను గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. నెల రోజులుగా జాకారంలో జిల్లా కలెక్టర్, జిల్లా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పోటీ పరీక్షల అభ్యర్థులకు వసతి, భోజన సదుపాయం కల్పిస్తుండగా సమారిటన్స్ ఫర్ ది నేషన్ సంస్థకు చెందిన రాము, దామోదర్ 15 రోజులకు సరిపడ బియ్యం పప్పు, నూనె, చెక్కర, ఉక్మా రవ్వ అందించారు. యువతకు అండగా సమాజం నిలవాలని సీతక్క ఆకాంక్షించారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా కార్యదర్శి నునేటి శ్యామ్, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు మామిడిశెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.