Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని వీఓఏ అనిత కోరారు. మండలంలోని దేవునూరు, ధర్మసాగర్ గ్రామాల్లో సర్వోదయా యూత్ ఆర్గనైజేషన్, మహిళా అభివద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సఖి అవగాహనా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సఖి సెంటర్ అందించే సేవలను కేస్ వర్కర్లు హరిత, వినీల వివరించారు. ఐదు రకాల సేవలను గురించి తెలిపారు. కౌన్సిలింగ్, వైద్య, పోలీస్, తాత్కాలిక వసతి, న్యాయ సాయాలు అందించనున్నట్టు వివరించారు. గహ హింస, లైంగిక వేధింపులు, తదితరాల నుంచి రక్షణ పొందడానికి సఖి సెంటర్ ఉపయోగపడుతుందని చెప్పారు. 181 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేస్తే తక్షణ సహాయం, రక్షణ లభిస్తాయని తెలిపారు. అలాగే 0870-2452112 నెంబర్కు ఫోన్ చేస్తే బాధిత మహిళలకు సహాయం అందుతుందని వివరించారు.