Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జేఏసీ చైర్మెన్ దేశినేని హనుమంతరావు
నవతెలంగాణ-హన్మకొండ
కుడా ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ జీఓను ఉపసంహరించుకోవడాన్ని రైతు విజయంగా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల రైతు ఐక్యకార్యాచరణ కమిటీ (జేఏసీ) చైర్మెన్ దేశినేని హనుమంతరావు అభివర్ణించారు. హనుమకొండ ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జేఏసీ కన్వీనర్లు బద్దె పెద్దన్న, బొమ్మినేని రవీందర్‌రెడ్డి, మునగాల యాకూబ్ తదితరులతో కలిసి హనుమంతరావు మాట్లాడారు. రైతులు వ్యవసాయం చేసుకొని బతికే భూమిని లాక్కునే విధానాన్ని వ్యతిరేకించామని చెప్పారు. రెండు నెలలుగా వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 27 గ్రామాల ప్రజలు ల్యాండ్ పూలింగ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించినట్లు గెలిపారు. ఉద్యమాలకు సహకరించిన కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇతర ప్రజాసంఘాలకు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రవీందర్‌రెడ్డి, పెద్దన్న మాట్లాడారు. రైతుల ఉద్యమాలను పోలీసులతో అణచే ప్రయత్నం చేస్తే మరింత పెద్దఎత్తున ఉద్యమిస్తామని చెప్పారు. గౌరవెల్లి, మొగిలిచర్ల రైతు ఉద్యమాలను ప్రభుత్వం అణిచి వేయడానికి ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.