Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం నాగకుమారి
నవతెలంగాణ-వేలేరు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జెడ్పీ హైస్కూల్ హెచ్ఎం నాగకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఆ పాఠశాలలో గురువారం నిర్వహించిన పేరెంట్స్ కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు. బడి ఈడు పిల్లలు బడుల్లో ఉండాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివద్ధికి ప్రతిఒక్కరూ కషి చేయాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందులు పడొద్దని చెప్పారు. విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న ఇంగ్లీష్ మీడియంలో విద్య, పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫామ్, మధ్యాహ్న భోజనం, తదితర సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు. అనంతరం సీఆర్పీ మొగిలిచెర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్య కమిటీతోపాటు సమాజంలోని ప్రతిఒక్కరూ పాఠశాల కార్యక్రమాల్లో భాగస్వాములౌతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్యను పెంచి పాఠశాలల అభివద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. విద్యార్థుల తల్లితండ్రులు మాట్లాడుతూ విద్యాభ్యాసన ప్రక్రియ విజయవంతానికి, పాఠశాల అభివద్ధికి సూచనలు అందించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ సూత్రపు తిరుమల, సభ్యులు ఫౌజియా, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.