Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రేగొండ
మండలంలోని రూపిరెడ్డిపల్లిలో వరంగల్‌కు చెందిన మెడికేర్ హాస్పిటల్ చైర్మెన్ డాక్టర్ ఉడుముల బాలా అధ్వర్యంలోని వైద్యుల బృందం సర్పంచ్ బండారి కవిత దేవేందర్ సహకారంతో హెల్త్ క్యాంప్ గురువారం నిర్వహించింది. వైద్య శిభిరంలో వైద్యులు చిన్నపరెడ్డి, నజీయా అంజుమ్, చీదర్ల రాంగోపాల్ వర్మ, అఖిల్, సిబ్బంది సుమంత్, రాజేష్, లక్ష్మీ, ప్రణరు అధ్వర్యంలో గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ బండారి కవిత దేవేందర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో మెడికేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం డాక్టర్ చిన్నపరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మద్ది భాగ్యలక్ష్మీ శంకర్, నాగపూరి సుజాత రఘు, పంచగిరి శ్రీలత ప్రకాష్, ముడుతనపల్లి స్వప్న సంతోష్, కొండమల్ల రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.