Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ - స్టేషన్ఘనపూర్
విధుల్లో అలసత్వం వహిస్తూ, ఇష్టమొచ్చినట్లు ఎక్కువ చేస్తే ఎంతటి వారైనా సస్పెండ్ చేస్తానని జనగామ కలెక్టర్ శివలింగయ్య హెచ్చరించారు. చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామాన్ని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి ఉపాధ్యా యుల, విద్యార్థుల హాజరు పట్టికపై వివరాలు అడిగి తెలుసు కున్నారు. ఉపాధ్యాయుల గైర్హజరుపై అడగ్గా ప్రధానోధ్యా యులు సెలవుపై వెళితే, మరో ఉపాధ్యాయుడికి పర్మిషన్ ఎలా ఇస్తారని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని సూచించారు. పాఠశాల అబివృద్ధి పనుల్లో నాణ్యత లోపం కారణంగా పంచాయతీ ఏఈ సందీప్‌ను మందలించారు. గ్రామంలోని చెత్త ను క్రిమిటోరియం (తడి, పొడి చెత్త వేరు చేయు ప్రదేశం) వాడుకుండా, గ్రామంలో సేకరించిన చెత్తను చెరువు కట్ట సమీపంలో ఎందుకు వేస్తున్నారని పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, సర్పంచ్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారిని చెట్లు ఎన్ని నాటారో వివరాలు చెప్పమని అడిగారు. సమాధానం చెప్పక పోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిదులు, అధికారులు పనుల్లో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై చర్యలు తప్పవని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ మామిడాల లింగారెడ్డి, పంచాయితీ కార్యదర్శి , అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.