Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీలకు ఇచ్చిన ఈడీ నోటీ సులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపులో భాగంగా గురువారం ఛలో రాజ్ భవన్ ముట్టడికి వెళుతున్న కాంగ్రెస్ శ్రేణులపై పోలీసులు అత్యు త్సాహం ప్రదర్శించి, లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తు న్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జక్కుల రాంరెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీకి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం పోలీసులతో దాడులు చేయించినా వెనక్కి తగ్గదే లేదన్నారు. నాటి స్వతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోడీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి,ఈడి నోటీసులను వెనక్కి తీసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ శ్రేణులపై లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కందాడి అశోక్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు జాటోత్ రవి నాయక్, తదితరులు పాల్గొన్నారు.