Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న
నవతెలంగాణ-తొర్రూరు
కౌలు రైతుల జీవితాలతో చెలగాటమొద్దని, వారి సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టి వెంకన్న అన్నారు. గురువారం తొర్రూర్ తాసిల్ధార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం జూనియర్ అసిస్టెంట్ రాహుల్కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ.. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 18 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ అంచనా వేసిందన్నారు. రాష్ట్రంలో సాగవుతున్న వ్యవసాయంలో 30 శాతం కౌలు రైతుల ద్వారా సాగవుతోందన్నారు. 2011 చట్టప్రకారం కౌలు రైతులకు ప్రతి సంవత్సరం రుణ అర్హత కార్డులు, బ్యాంకు రుణాలు, రైతు బీమా, ప్రకతి వైపరీత్యాల. పరిహారం పంటల బీమా, ప్రభుత్వ పథకాలు, తదితర డిమాండ్లు పరిష్కరించాలన్నారు. అలాగే 57 సంవత్సరాలు దాటిన కౌలు రైతులకు నెలకు రూ5వేల పెన్షన్ ఇవ్వాలన్నారు. లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొల్లం అశోక్, ఎండి యాకుబ్, తాళ్ళ వెంకటేశ్వర్లు, బోర స్వామి, మహేష్ ,యాకన్న, లక్ష్మి, వెంకటమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.