Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్
నవతెలంగాణ-మరిపెడ
దేశానికి కమ్యూనిస్టులే ప్రత్యామ్నాయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ అన్నారు. గురువారం సీపీఐ(ఎం) మండల రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక కనకదుర్గ ఫంక్షన్ హాల్లో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశాన్ని పాలించిన కాంగ్రెసు, బీజేపీలు ప్రజలకు సరైన సేవలందించలేకపోయాయన్నారు. ఏటాకోటి ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి అధికారంలోకొచ్చిన బీజేపీ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసీ, రైల్వే ,బ్యాంకులు ,హెయిర్ ఇండియా, బీహెచ్సీఎల్, తదితరవి కారుచౌకగా పెట్టుబడిదారులకు అమ్ముతున్నారన్నారు. జనదన్ ఖాతాలోకి డబ్బులు పంపిస్తామని ఖాతాలు తీయించి, నోట్ల కట్టలు మార్చి బీజేపీ కోట్లు సంపాదించుకుందన్నారు. మతం పేరిట హిందూ, ముస్లిం, క్రిస్టియన్ల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్నదని ఆరోపించారు. దేశ సమగ్రత సమైక్యత కోసం నిరంతరంగా కషి చేస్తున్నది కమ్యూనిస్టులే అన్నారు. ఢిల్లీ నడిబొడ్డున రైతన్న ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వం మెడలు వంచిన ఘనత కమ్యూనిస్టు రైతాంగ ఉద్యమానికి ఉందని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారి స్ఫూర్తితో మరిన్ని కమ్యూనిస్టు ఉద్యమాలు రానున్నాయని తెలిపారు. తెలంగాణలో పోడు భూములు, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం భవిష్యత్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న, అలవాల వీరయ్య, మండల కార్యదర్శి దుండి వీరన్న, నాయకులు నందిపాటి వెంకన్న, కందాల రమేష్, బాణాల. రాజన్న గంధసిరి పుల్లయ్య, కొయ్యడ రామయ్య, తదితరులు పాల్గొన్నారు.