Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక ఇబ్బందుల్లో పేద కుటుంబం
- వైద్యం కోసం ఇప్పటికే రూ.లక్షల్లో ఖర్చు
- ఆదుకోవాలని వేడుకోలు
నవతెలంగాణ-పెద్దవంగర
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం వారిది. ఈ తరుణంలో ఆ ఇంటి పెద్ద ఓ ప్రమాదానికి గురై మూడేం డ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. లేవలేడు, నడవలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబం దీనావస్థలో పడింది. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఆరోగ్యం మరింత క్షీణిస్తోంది. దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం బాధిత కుటుంబం ఎదురుచూస్తోంది. వివరా ల్లోకెళ్తే... మండల కేంద్రానికి చెందిన గాజరబోయిన సంపత్ గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్ గా కొన్నేండ్లుగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అరకొర సంపా దనే అయినా భార్య సరిత, కుమారుడు నిఖిల్, కూతురు లాస్యతో కుటుంబం గడిపేవాడు. ఈక్రమంలో డాబా మీద నిద్రిస్తున్న సంపత్ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో వెన్నెముక, నడుము విరిగి నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇక కుటుంబ పోషణ భారం అతడి భార్య పై పడింది. వరంగల్ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించినప్పటికి నయం కాలేదు. వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లోని నిమ్స్‌లో ఆపరేషన్ చేయించినప్పటికి కోలుకోలేదు. నడుము భాగం నుంచి పాదల వరకు స్పర్శ లేకపోవడంతో వైద్యులు చేతులెత్తేశారు. సర్జరీ చేసే పరిస్థితి లేదు. ఫిజియోథెరపీ చేయించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో మూడేండ్లుగా ఇంట్లోనే మంచానికే పరిమితమాయ్యాడు. డబ్బులు లేక ఆర్థికంగా ఆ కుటుంబం చితికిపోయింది. ఆర్థిక సాయం కోసం సంపత్ దాతలను అర్థిస్తున్నాడు. సాయం చేసి తన బతుకులో వెలుగులు నింపాలని కోరు తున్నాడు. ఎవరైనా దాతలు ఉంటే 62507122751, 6301009927లో సంప్రదించాలని వేడుకుంటున్నాడు.
పూటగడవని దుస్థితి
పస్తులతో కుటుంబం రోజులు గడపాల్సిన పరిస్థితి నెలకొంది. మూడేండ్లుగా మంచానికే పరిమితం కావడంతో ఆర్థికంగా చితికిపోయం. కూలీకి పోగా వచ్చిన డబ్బులు కుటుంబ పోషణకు సరిపోవడం లేదు. మెరుగైన వైద్యం, ఫిజియోథెరపీ చేయించే ఆర్థిక స్థోమత లేదు. పిల్లల భవిష్యత్ అంధకారంగా మారింది. దాదాపు రూ.5లక్షలు అప్పులు చేసి వైద్యం చేయించినా ఫలితం లేకుండా పోతోంది. దాతలు తమను ఆదుకోవాలి. అధికారులు ఆసరా పింఛన్ ఇప్పించాలి.
- గాజరబోయిన సరిత(పెద్దవంగర), బాధితుడి భార్య