Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూర్ రూరల్
ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు సకాలంలో పుస్తకాలు, యూనిఫాం అందించుటకు తగిన చర్యలు తీసుకుని సౌకర్యాలు కల్పించాలని జెడ్పీ ఫ్లోర్ లీడర్, తొర్రూరు జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ కోరారు. గురువారం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేసి ఆయన మాట్లాడారు. తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణ వర్షాకాలం వచ్చిందంటే గుట్టనుండి వచ్చే నీరు జాలు వారుతుందని, దీంతె విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. పెండింగ్ మధ్యాహన్న భోజనం బిల్స్ చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.