Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్
- యూన్యన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి
నవతెలంగాణ-జఫర్గడ్
అంగన్వాడీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉన్నారని, ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూన్యన్(టీఆర్ఎస్కేవీ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య భవన్లో యూనియన్ మండల విస్తత స్థాయి సమావేశం ప్రాజెక్టు అధ్యక్షురాలు జి విజయ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సదర్భంగా భారతి పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీ ల సమస్యలు పరిష్క రించాలని అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తే అంగన్వాడి ల పై లాఠీలుర, తూటాలు ప్రయోగించి , గుర్రాలతో తొక్కించారని ఆరోపించారు. కానీ స్వరాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలు సీఎం పరిష్కరిం చారన్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా 30శాతం పీఆర్సీ ఇచ్చి వేతనాలు పెంచారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీంలో పని చేస్తున్న అంగన్వాడీలకు ఇప్పటివరకు వేతనాలు పెంచక పోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షులు వేముల నర్సింగం మాట్లాడుతూ... అంగన్ వాడీల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారని కొనియాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అంగన్వాడీలు అండగా నిలబడాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కోమల్ల ఎల్లమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ముస్కు అరుణ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రేణుక, వైస్ ప్రెసిడెంట్ రజిత, జిల్లా నాయకులు, కవిత, రంగు ఉమ, విజయ రాణి, సునిత పాల్గొన్నారు.