Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మాజీ డిప్యూటీ సీఎం, స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. చిల్పూర్ మండలంలోని పల్లగుట్ట గ్రామంలోని గ్రామ పంచాయతీ ప్రాంగణంలో ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సహకారంతో సెనర్జియా గ్రూప్ చైర్మెన్ జీడి జాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంప్‌ను ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజయ్య, విశిష్ట అతిథులుగా జెడ్పీ చైర్మెన్ పాగాల సంపత్‌రెడ్డి, చిల్పూర్ గుట్ట ఆలయ కమిటీ చైర్మెన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. స్వరాష్ట్రం సాధించిన అనంతరం బంగారు తెలంగాణతోపాటు ఆరోగ్య తెలంగాణగా చేయడానికి సీఎం కేసీఆర్ సంకల్పించారని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో మెగా ఆరోగ్య మేళాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. స్వచ్చంద సేవా సంస్థలు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బత్తిని శ్రీను, డైరెక్టర్లు రాజన్ బాబు, వెంకటయ్య, జీడి ఆనంద్, వేల్పుల గట్టేశం, చేరాలు, తదితరులు పాల్గొన్నారు.