Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి సత్యనారాయణరావు
నవతెలంగాణ-భూపాలపల్లి
రానున్న ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్‌పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఏఐసీసీ అగ్రనేతలైన సోనియా, రాహుల్‌గాంధీలపై ఈడీ కేసులు పెట్టిస్తోందని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డీసీసీ అధ్యక్షుడు అయితే ప్రకాష్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి గండ్ర సత్యనారాయణరావు హాజరై మాట్లాడారు. సోనియా, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు జారీ చేయడం భారతదేశానికే అవమానకరమన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను దెబ్బ తీసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపిందని మండిపడ్డారు. కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో భూపాలపల్లి పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పసూనుటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి అజ్మీర జంపన్న, దుడపాక శంకర్, దండు రమేష్, మహేష్ యాదవ్, చల్లూరు మధు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భువనసుందర్, పార్టీ మండల అధ్యక్షుడు రాంచంద్రయ్య, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, రాజన్న, పట్టణ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుర్ర కొమురయ్య, ఐఎన్టీయూసీ నాయకులు బాలరాజు, బానోత్ రాములు, సమ్మిరెడ్డి, మహేష్, శ్రీను, బౌతు రాజేష్, శ్రీను, జిల్లా సోషల్ మీడియా ఇన్‌ఛార్జి పోలుసాని కరుణాకర్‌రావు, సతీష్, తదితరులు పాల్గొన్నారు.