Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యానవన శాఖ అధికారి అక్బర్ ఖాన్
నవతెలంగాణ-మల్హర్రావు
నీటి వసతి ఉంటే రైతులు ఆయిల్ పామ్ సాగు చేసుకుంటే వరి కంటే అధిక లాభాలు వస్తాయని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి అక్బర్ ఖాన్ అన్నారు. మండలంలోని కొయ్యూరు, రుద్రారం క్లస్టర్ల రైతులకు ఆయిల్ పామ్ సాగుపై శుక్రవారం నిర్వహించిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో అక్బర్ ఖాన్ మాట్లాడారు. ఆయిల్ పామ్ పంట సాగు పద్ధతులు, సబ్సిడీ వివరాలు, అంతర పంట సాగు, పంట సాగుకు అనువైన పరిస్థితులు, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ వివరాలపై అవగాహన కల్పించారు. ఆయిల్ పామ్ సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చన్నారు. ఆయిల్ పామ్ చీడపీడలను తట్టుకోవడమే కాక తక్కువ ఖర్చు అని చెప్పారు. అలాగే 85 శాతం సబ్సిడీ, డ్రిప్ పరికరాలు, ఎరువులు రాయితీతో ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు సిద్ది లింగమూర్తి, రమేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ పుట్ట శ్రీనివాస్, ఉద్యాన శాఖ అధికారి సునీల్‌రావు, వ్యవసాయ అధికారి ముంజ మహేష్, ఏఈఓ అనూష, ఆగ్రోస్ ప్రతినిధి రాందాస్, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.