Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
నవతెలంగాణ-భూపాలపల్లి
భూపాలపల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా 12, 13, ఒకటో వార్డుల్లోని ఖాసింపల్లి, సెగ్గంపల్లిలో కలెక్టర్ శుక్రవారం పర్యటించారు. వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను స్వీకరించి అధికారులకు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఖాసింపల్లిలోని అప్పర్ ప్రైమరీ స్కూల్లో కలెక్టర్ విద్యార్థుల హాజరు నమోదు, సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఆరుబయట కూర్చొని ఉన్న మల్లయ్య వద్ధాప్య పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయా? అడిగి తెలుసుకున్నారు. అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని మౌలిక వసతుల కల్పనకు కషి చేస్తానన్నారు. 13వ వార్డులోని హెల్త్ సబ్ సెంటర్‌ను పరిశీలించి ఫర్నీచర్ సమకూర్చుకుని ప్రారంభించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలిపారు. అంగన్వాడి సెంటర్‌ను పరిశీలించి పిల్లల, గర్భిణులు, బాలింతల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు పోషకాహారాన్ని అందజేయాలని, చదువు పట్ల ఆసక్తి కలిగేలా బోధించాలని కలెక్టర్ సూచించారు. సెగ్గంపల్లిలోని అంగన్వాడీ సెంటర్‌ను పరిశీలించి త్వరగా మరమ్మతులు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధూ, వైస్ చైర్మెన్ హరిబాబు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ రోజారాణి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంతి, సీపీఓ మహేష్, తదితరులు పాల్గొన్నారు.