Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిర్వహిస్తూ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో శుక్రవారం ఆందోళన చేస్తున్న నిరుద్యోగ ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల లో మండల వాసికి తీవ్రగాయాలు అయ్యాయి. మండలంలోని మద్దివంచలో నిరుపేద కుటుంబానికి చెందిన లక్కం వినరుకు ఛాతీలో రబ్బరు బుల్లెట్ తగిలి గాయం కావడంతో అంబులెన్స్ లో సికింద్రాబాద్ ఆసుపత్రికి తరలించారు. వినరు 2021లో ఆర్మీ లో ప్రభు త్వం నిర్వహించిన భౌతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. పరీక్ష నిర్వహించక పోవడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతూ అందోళన నిర్వహిస్తే కాల్పు లు జరపడం అన్యాయం అని తల్లిదండ్రులు వెంకన్న, సుభద్ర కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ విలపించారు. గాయపడిన వినరు కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పలు పార్టీల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.